విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ కార్యాలయం ప్రారంభం

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

మహారాణిపేట: వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌’ (వీఈఆర్‌)కార్యాలయం శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇటీవల నీతి ఆయోగ్‌ దేశవ్యాప్తంగా ప్రకటించిన మూడు ఆర్థిక ప్రాంతాలలో విశాఖ ఒకటి కావడం గమనార్హం. వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ఎంవీ ప్రణవ్‌ గోపాల్‌ సమక్షంలో.. వీఈఆర్‌ సీఈవో డాక్టర్‌ ఎన్‌. యువరాజ్‌ చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వీఈఆర్‌ డిప్యూటీ సీఈవో, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఎన్‌. తేజ్‌ భరత్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, అదనపు కమిషనర్‌ దాట్ల కీర్తి, వోఎస్‌డీ కృష్ణా నాయక్‌, కార్యదర్శి మురళీ కృష్ణ, ముఖ్య ఇంజనీర్‌ వినయ్‌ కుమార్‌, ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్‌, ముఖ్య ప్రణాళిక అధికారి దివ్య లతలతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement