రేపు గవర్నర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

రేపు గవర్నర్‌ రాక

Jun 5 2026 12:12 AM | Updated on Jun 5 2026 12:12 AM

మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శనివారం విశాఖ వస్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(సంగివలస)లో 6వ గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడ వెళ్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement