భలేభలే పాపకార్న్‌ | - | Sakshi
Sakshi News home page

భలేభలే పాపకార్న్‌

Jun 5 2026 12:06 AM | Updated on Jun 5 2026 12:06 AM

ఎండలు మండిపోతుంటే జనాలు రకరకాల ఐడియాలతో రోడ్లపైకి వస్తున్నారు. కొందరు గొడుగులు పడితే, మరికొందరు స్కార్ఫ్‌లు కడుతున్నారు. కానీ.. ఈ బుజ్జాయి మాత్రం రూటే మార్చేసింది.. ‘హెల్మెట్‌ పెట్టుకుంటే నా అందం ఎవరికీ కనిపించదు.. అదే ఈ బకెట్‌ నెత్తిన పెడితే ఊరంతా నన్నే చూస్తుంది’ అన్నట్టుగా.. తలపై ఒక ఖాళీ ‘పాప్‌కార్న్‌ బకెట్‌’ బోర్లించి భలే గమ్మత్తుగా ప్రయాణించింది. దొండపర్తి రోడ్డులో వెళ్తున్న వాహనదారులను, పాదచారులను ఇట్టే ఆకట్టుకున్న ఈ చిన్నారి ఫన్నీ లుక్‌ను ‘సాక్షి’ తన కెమెరాలో క్లిక్‌ మనిపించింది.

– అల్లిపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement