ఎంవీపీకాలనీ: మిస్ సౌత్ పసిఫిక్ ఆస్ట్రేలియా అందాల పోటీల్లో విశాఖ యువతి దేవి దివాకుల సత్తా చాటారు. సౌత్ పసిఫిక్ దేశాల అందాల పోటీల్లో భాగంగా సౌత్ పసిఫిక్ ఆస్ట్రేలియా అందాల పోటీ–2026ను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఇటీవల నిర్వహించారు. 20 మంది యువతులు పోటీ పడ్డారు. తుది పోటీల్లో విశాఖ రైల్వే న్యూకాలనీకి చెందిన దేవి దివాకుల విన్నర్‌గా నిలిచి మిస్ సౌత్ పసిఫిక్ దేశాల అందాల పోటీకి ఎంపికయ్యారు. ఈ పోటీలు త్వరలో న్యూజిల్యాండ్ వేదికగా జరగనున్నాయి. 2023లో దేవి దివాకుల జీబీటీ మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన సత్తాచాటిన విషయం తెలిసిందే. ఇదే స్ఫూర్తితో ఆమె త్వరలో సౌత్ పసిఫిక్ దేశాల అందాల పోటీలో విజేతగా నిలవడంతో పాటు మిస్ వరల్డ్ పోటీల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు ఆమె తల్లి జ్యోతి దివాకుల వెల్లడించారు.


