ఏయూక్యాంపస్: బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్‌లో ’సుత్రా ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్’ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శన బుధవారం ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఎగ్జిబిషన్‌కు ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు తమ ప్రత్యేక కలెక్షన్లను అందుబాటులో ఉంచాయి. ముఖ్యంగా మహిళలు, యువత కోసం ట్రెండీ దుస్తులు, కౌట్యూర్ వేర్, కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ ఆభరణాలు, హోమ్ డెకర్ ఉత్పత్తులు, ఫ్యాబ్రిక్స్, యాక్సెసరీస్, హైహీల్స్, ఫైన్ జ్యువెలరీ తదితర వస్తువులను ఒకేచోట ప్రదర్శిస్తున్నారు. వేసవి సీజన్‌కు అనుగుణంగా రూపొందించిన నూతన ఫ్యాషన్ కలెక్షన్లు, ప్రత్యేక ఆఫర్లు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.


