జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శ్రీ విశ్వ విజయభేరి | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శ్రీ విశ్వ విజయభేరి

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

సీతంపేట: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీ విశ్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన మేడిశెట్టి తాతాజీ 30వ ర్యాంకు, కె.జాహ్నవి 74వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వీరితో పాటు జి.ఇషాంత్‌కుమార్‌ 318, డి.సాయిదేవి చంద్రిక 567, ఎ.వెంకట్‌ పుష్కర్‌ 971 ర్యాంకులతో జాతీయ స్థాయిలో మెరిశారు. అలాగే వి.నేహ 1127, డి.దేవమణికంఠ 1157, బి.కాళీచరణ్‌ 1264, బి.లక్షదీప్‌ 1560, జె.కీర్తి షర్మిల 1787, పి.అభినవ్‌ జయకర్‌ 1868 ర్యాంకులు కై వసం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యా సంస్థల నుంచి వెయ్యిలోపు ఐదుగురు, 5 వేల లోపు 35 మంది, 10 వేల లోపు 52 మంది నిలిచారు. ఈ అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను శ్రీ విశ్వ విద్యాసంస్థల చైర్మన్‌ కె.ధర్మరాజు, డైరెక్టర్‌ పి.సూర్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement