మహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సమర్పిస్తున్న అనేక వినతులకు సకాలంలో పరిష్కారం లభించడం లేదంటూ పలువురు అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేరుకే పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, కొన్ని సమస్యలు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 116 వినతులను జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఏడీసీ సత్యవేణి, ఆర్డీవో శేష శైలజ, ఆర్డీవోలు, తహశీల్దార్లు స్వీకరించారు.


