అల్లిపురం: రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది సివిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 15 మంది విశాఖ రేంజ్‌కు చెందిన వారు కావటం విశేషం. పదోన్నతులు పొందిన వారిలో విశాఖకు చెందిన ఎం.శేషు, మహమ్మద్ సనావుల్లా, ఎం.చంద్రశేఖర్, పి.వి.వి.నరసింహారావు, వి.బాబ్జీరావు, ఆర్.నీలయ్య, జి.వెంకటరమణ, వి.చంద్రశేఖర్, టి.సీతారామ్, ఎం.బుచ్చిరాజు, ఎస్.రామకృష్ణ, చౌదరి ధనుంజయ నాయుడు, హెచ్.మల్లేశ్వర రావు, బి.వి.జగన్నాథ రాజు, చొల్లంగి తిరుపతిరావులు ఉన్నారు.
ముగ్గురు ఎస్‌ఐలకు సీఐగా..
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతి లభించింది. షేక్ అబ్దుల్ మారఫ్ (కంచరపాలెం క్రైం), సీహెచ్ రామ్‌దాస్ (ఎంవీపీ క్రైం), జి.అప్పారావు (వన్‌టౌన్ ట్రాఫిక్) పదోన్నతి పొందగా.. వీరిని విశాఖ రేంజ్‌కు బదిలీ చేశారు.


