దండయాత్ర | - | Sakshi
Sakshi News home page

దండయాత్ర

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

దగా డీఎస్సీపై

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సమరభేరి

సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌

పోలీసుల ఆంక్షలు.. కలెక్టరేట్‌ వద్ద ధర్నా

భారీగా తరలివచ్చిన యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహంచిన ‘మెగా డీఎస్సీ’ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ‘మెగా మోసం’గా మారిందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన తొలి సంతకంలోనే భారీ అక్రమాలు, దగా దాగి ఉన్నాయని ఆరోపించింది. ఈ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త దేవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సమరభేరి మోగించాయి. జిల్లా పరిషత్‌ కార్యాలయ జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ప్రదర్శనలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్తలు తిప్పల దేవన్‌ రెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వైఎస్సార్‌సీపీ మహిళా నేత సిరిసహస్ర, నియోజకవర్గ పరిశీలకులు వీసం రామకృష్ణ, జహీర్‌ అహ్మద్‌, పేడాడ రమణికుమారి, కోలా గురువులు, సతీష్‌వర్మ, మాజీ డిప్యూటీ మేయర్‌ కటామురి సతీష్‌, జిల్లా పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవి రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, ముఖ్యనాయకులు మంచ నాగ మల్లేశ్వరి, పల్లా దుర్గారావు, ప్రసాద్‌ రాజు, బొల్లవరపు జాన్‌ వెస్లీ, పోతిన శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, అంబటి శైలేష్‌, పీవీ సురేష్‌, ముట్టి సునీల్‌కుమార్‌, జిలకర్ర నాగేంద్ర, సేనాపతి అప్పారావు, సనపల రవీంద్రభరత్‌, బోని శివరామకృష్ణ, భర్కత్‌ అలీ, ప్రసాద్‌, ఆర్‌.అనిల్‌ కుమార్‌, రామారెడ్డి, పీలా ప్రేమ కిరణ్‌, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీ ప్రసాద్‌, వడ్డాది దీలిప్‌ కుమార్‌, సకలభక్తుల ప్రసాద్‌ రావు, దేవరకొండ మార్కండేయులు, బోండా ఉమా మహేశ్వర రావు, నీలి రవి, మనోజ్‌ కుమార్‌ గొడబా, కోడిగుడ్ల పూర్ణమి, మేరువు గణేష్‌, కోడూరు సత్యనారాయణ, తాలు సాయి మోహన్‌ రావు, రెయ్యి వెంకటరమణ, ముదుండి రాజేశ్వరి, ఈశ్వరరావు, కె. వెంకట నాగ శశికళ, పిల్లా సుజాత, బెందాళం పద్మావతి, మల్లా ధనలత, దొడ్డి కిరణ్‌, పులుగం శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువతకు సమాధానం చెప్పాలి: వరుదు కల్యాణి

ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతను తీవ్రంగా నిరాశపరిచిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. ‘మెగా డీఎస్సీ’ పేరుతో భారీ ప్రచారం చేసి, చివరకు అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుందని విమర్శించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో ఆరోపణలు వస్తున్న అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అందుకే పవన్‌ కల్యాణ్‌ స్పందించడం లేదు: జక్కంపూడి రాజా

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై మంత్రి నారా లోకేష్‌ వెంటనే స్పందించి సీబీఐ విచారణకు అంగీకరించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ కావడం వల్లే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ అంశంపై స్పందించడం లేదని విమర్శించారు. డీఎస్సీ, ఈఎస్‌ఐ వ్యవహారాలపై వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని, పోలీసుల లాఠీలకు తమ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కాపు సామాజికవర్గం గురించి మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు వారి సమస్యలపై మౌనం వహిస్తున్నారని విమర్శించారు. పవన్‌ను నమ్మి తప్పు చేశామన్న భావన కాపు సామాజికవర్గంలో ఉందన్నారు.

నిరుద్యోగులను దగా చేశారు: కేకే రాజు

గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కేవలం రాజకీయ ప్రచారం కోసం రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని కేకే రాజు ఆరోపించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి, రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 1.40 లక్షల సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తుచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement