పోలీసులు అడ్డుకునే యత్నం | - | Sakshi
Sakshi News home page

పోలీసులు అడ్డుకునే యత్నం

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

సోమవారం ఉదయం 10 గంటల నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు, ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పందిస్తూ, ‘అరెస్టు చేసుకుంటే చేసుకోండి’ అంటూ పోలీసులకు సమాధానం ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద రెండు గంటల పాటు బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించిన కేకే రాజు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లను పోలీసులు బలవంతంగా లాగేందుకు యత్నించారు. అంతకుముందు జెడ్పీ కార్యాలయం వద్ద కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిరసన కార్యక్రమం కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

కలెక్టరేట్‌ బయట కేకే రాజు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లను బలవంతంగా లాగుతున్న పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement