ఏడు మ్యాచ్‌లు.. ఏడు విజయాలు.. నైనాకు చెస్‌ టైటిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఏడు మ్యాచ్‌లు.. ఏడు విజయాలు.. నైనాకు చెస్‌ టైటిల్‌

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

విశాఖ స్పోర్ట్స్‌ : స్టేట్‌ ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఏరీనా ఫిడే మాస్టర్‌ జి. నైనా విజేతగా నిలిచింది. ఏడు రౌండ్లపాటు జరిగిన టోర్నీలో నైనా అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.శ్రీరామ్‌, రామ్‌కుమార్‌ విజయకుమార్‌లు ఆరున్నర పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, మార్తాండ, ప్రేమ్‌సాయి, అర్జున్‌, రుత్విక్‌, ప్రవల్‌లు ఆరు పాయింట్లు సాధించి ప్రతిభ కనబరిచారు. ఆల్‌ విశాఖ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్ర చెస్‌ సంఘం సహకారంతో ఎస్‌3 స్పోర్ట్స్‌ ఎరీనాలో ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో 305 మంది చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 92 మంది ఫిడే రేటింగ్‌ పొందిన క్రీడాకారులు ఉన్నారు.టోర్నీలో మొత్తం రూ.1 లక్ష ప్రైజ్‌మనీని వివిధ విభాగాల విజేతలకు అందజేశారు. చాంపియన్‌గా నిలిచిన నైనా రూ.9 వేల నగదు బహుమతిని అందుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement