రూ. 2.5 కోట్లతో కొమ్మాది శాప్‌ స్టేడియం అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రూ. 2.5 కోట్లతో కొమ్మాది శాప్‌ స్టేడియం అభివృద్ధి

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మధురవాడ : కొమ్మాదిలోని 27 ఎకరాల విస్తీర్ణంలో విశాఖ శాప్‌ స్టేడియాన్ని రూ. 2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడా అకాడమీల ఎంపిక ప్రక్రియను ఆయన ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు విశాఖ, కాకినాడ, తిరుపతిలో ప్రత్యేక అకాడమీల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. విశాఖలో అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలు, తిరుపతిలో జ్యూడో, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌ అకాడమీలు, కాకినాడలో బాలికల కోసం వెయిట్‌లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, ఖోఖో అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎంపికై న ప్రతిభావంతులైన క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, వసతి, పోషకాహారం అందిస్తామన్నారు. విశాఖ నగరానికి కొత్తగా 200 ఎలక్ట్రికల్‌ బస్సులను కేటాయిస్తున్నామని, అందులో 50 బస్సులను భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement