వ్యాపారులకు అది కుళ్లిన నష్టం.. కానీ ఆకలితో అలమటించే పేదలకు అదే ఒక రోజు జీవనాధారం. కాన్వెంట్ జంక్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి లోడ్లలో కుల్లిపోయాయన్న కారణంతో వ్యాపారులు రోడ్డు పక్కన పారేసిన ఉల్లిపాయలు, కొందరు పేదల పొట్ట నింపుతున్నాయి. సమాజం చెత్తగా భావించి విసిరేసిన ఆ కుప్పలోనే తమ బతుకు దెరువును వెతుక్కుంటూ, పనికొచ్చే ఉల్లిపాయలను ఏరుకుంటూ.. వాటిని చిరు దుకాణాలకు అమ్మి జీవనం సాగిస్తున్న దీనగాథ ‘సాక్షి’ కంటికి చిక్కిందిలా..
– ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


