దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వోగా బాలాజీ కిరణ్‌ | - | Sakshi
Sakshi News home page

దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వోగా బాలాజీ కిరణ్‌

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

తాటిచెట్లపాలెం: దక్షిణ కోస్తా రైల్వే నూతన ప్రధాన ప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్‌వో)గా 2013 ఐఆర్‌టీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వై.బాలాజీ కిరణ్‌ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన సౌత్‌ కోస్ట్‌ రైల్వేలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–కమ్‌–సెక్రటరీ టు జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రైల్వే సేవల్లో విశేష అనుభవం కలిగిన బాలాజీ కిరణ్‌ గతంలో గుంతకల్‌ డివిజన్‌లో సీనియర్‌ డివిజనల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా, అలాగే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలో సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటకు చెందిన బాలాజీ కిరణ్‌.. ‘ఆశయ’ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement