● నమో.. సూర్యదేవా.. | - | Sakshi
Sakshi News home page

● నమో.. సూర్యదేవా..

Nov 8 2024 12:52 AM | Updated on Nov 8 2024 12:52 AM

● నమో

● నమో.. సూర్యదేవా..

ఘనంగా

ఛట్‌ పూజ

ఏయూక్యాంపస్‌: ఉత్తరాది రాష్ట్రాల సంప్రదాయ పండగైన ఛట్‌ పూజ విశాఖలో ఘనంగా జరిగింది. విశాఖలో నివసిస్తున్న వేలాది ఉత్తరాది ప్రజలు గురువారం సాయంత్రం ఆర్‌.కె.బీచ్‌కు చేరుకుని సూర్య భగవానుడిని ఆరాధించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజలో పాల్గొని, ఉత్తరాది ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయించే సూర్యుడితో పాటు అస్తమించే సూర్యుడిని పూజించే ఈ సంప్రదాయం ఎంతో ప్రత్యేకమైనదని సీపీ అన్నారు. ఈ సందర్భంగా ఛట్‌ పూజ సమితి ప్రతినిధి సుభాష్‌ చంద్రరాయ్‌ మాట్లాడుతూ గత ఆరేళ్లుగా విశాఖలో ఈ పండగను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సూర్య భగవానుడి ఆశీస్సులు కోరుతూ, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండగలో ప్రసాదంగా ఉపయోగించే చెరకు, బెల్లం, కొబ్బరి, అరటి, పసుపు, అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వివరించారు. ఉత్తరాది మహిళల సంప్రదాయ వేషధారణ, ఇనుక తిన్నెలపై దీపాలను వెలిగించి సూర్య భగవానుడిని ఆరాధించే విధానం విశాఖ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాది ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం కలిగిందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యుత్‌ కాంతుల్లో ఛట్‌ పూజా ప్రాంగణం

● నమో.. సూర్యదేవా..1
1/3

● నమో.. సూర్యదేవా..

● నమో.. సూర్యదేవా..2
2/3

● నమో.. సూర్యదేవా..

● నమో.. సూర్యదేవా..3
3/3

● నమో.. సూర్యదేవా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement