ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం రెండే
ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అంటూ గొప్పలు చెప్పి తప్పించుకుంది.
18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.1,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని మహిళలు రగిలిపోతున్నారు.
అన్నదాత సుఖీభవ కింద రైతులకు ప్రతి ఏడాదీ రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టిందని అన్నదాతలు మండిపడుతున్నారు.
అన్ని అర్హతలుండి రెండేళ్లుగా పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అభాగ్యులు శాపనార్థాలు పెడుతున్నారు.
వలంటీర్లకు నెలకు రూ.10 వేలు అంటూ గొప్పలు చెప్పి తప్పించుకున్నారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
పల్లె వైద్యాన్ని నీరుగార్చి దీర్ఘకాలిక రోగులను ముప్పుతిప్పలు పెడుతున్నారని వాపోతున్నారు.
కక్షలు, కేసులే ఎక్కువ
సూపర్ సిక్స్.. సూపర్ ప్లాప్
కాళ్లరిగేలా తిరుగుతున్నా అందని కొత్త పింఛన్లు
కూటమి రెండేళ్ల పాలనపై
దుమ్మెత్తిపోస్తున్న జనం
ఈ ఫొటోలోని మహిళ పేరు సీ.రాణి. ఈమెది ముత్తువారిపల్లె. గత ప్ర భుత్వంలో ఆమె ఉన్న గ్రూపులో అప్పు తీసు కుని, కట్టిన వడ్డీని మూ డు విడతలుగా ఆమె ఖతాల్లోకి వేశారు. అప్పట్లో జగనన్న చెప్పినట్టు 2014 నుంచి 2019 ఏప్రిల్ వరకు అప్పు తీసుకున్న గ్రూపులో ఆమె ఉండేది. ఆ గ్రూపునకు వడ్డీ వెనక్కి వచ్చింది. అదనంగా ఆమెకు లభించిన డబ్బు ఎంతో ఉపయోగపడింది. కానీ ఈ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఇ స్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా దాని ఊసేలేదు. అసలు ఇస్తా రో లేదో కూడా తెలియడం లేదు.
కూటమి రెండేళ్ల పాలనపై జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కినాక చుక్కలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు దూరం చేసి.. తీవ్ర అగచాట్లు మిగిల్చారని నిప్పులు చెరుగుతున్నారు. కార్మికుల నుంచి కర్షకుల వరకు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తూ కడుపు కొడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారని అన్నదాతలు శాపనార్థాలు పెడుతున్నారు. ఇంటి గడపకొచ్చే సేవల్ని దూరం చేశారని కన్నెర్రజేస్తున్నారు. ప్రజల నోటికాడ ముద్ద తీసేసి సంబరాల పేరుతో సభలు పెట్టేందుకు సిద్ధపడ్డారని విరుచుకుపడుతున్నారు. ‘ఏం చేశావని సంబరాలు బాబూ’ అంటూ నిలదీసేందుకు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనప్పటికీ ప్రధాన హామీలు నెరవేర్చలేకపోయింది. ఉద్యోగాల సృష్టి.. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి జాడ కరువైంది. సూపర్ సిక్స్ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. రెండేళ్ల లో అన్ని హామీలు అమలు చేసేశామని.. రాష్ట్రం బ్ర హ్మాండంగా ముందుకు వెళుతోందని చెప్పుకుంటూ.. నేడు విజయోత్సవం జరుపుకోవడాన్ని జనం తప్పుపడుతున్నారు. ‘ఏం చేశారని.. విజయోత్సవాలు’ అ ని ప్రశ్నిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరు చెప్పి ఓట్లు వే యించుకుని మోసం చేశారని శాపనార్థాలు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే వచ్చే వని గుర్తుచేసుకుంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రజల కష్ట నష్టాల ను తెలుసుకుని పరిష్కరించేవారని మాట్లాడుకుంటున్నారు. వలంటీర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంటింటికీ వెళ్లి సేవలందించేవారని చెప్పు కుంటున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సీన్ రివర్స్ అయ్యిందని విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలు దూరం చేశారని మండిపడుతున్నారు.
హామీలు డాబు..అమలేది బాబు?
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సవాలక్ష హామీలు గుప్పించింది. అందులో కొన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. సూపర్ సిక్స్ అంటూ సూపర్‌గా మోసం చేసింది. ఇందులో ముఖ్యంగా
ఏం చేశారని విజయోత్సవం?
రెండేళ్లుగా సంక్షేమం ఊసే లేదు


