
శ్రీ సిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు
సత్యవేడు: ఏపీ దర్శన్ సీడీ టూర్‌లో భాగంగా 2– 24బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు శనివారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శివశంకర్ వీరికి స్వాగతం పలికారు. శ్రీ సిటీ ప్రణాళిక, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధిపై వారికి ప్రదర్శన ఇచ్చారు. మేక్–ఇన్– ఇండియా మిషన్‌లో శ్రీసిటీ పాత్ర, భారీ ఉపాధి కల్పన, ఈ ప్రాత ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతమిచ్చారనే అంశాలను వివరించారు. పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌లు శ్రీసిటీ పరిసరాలు సందర్శించారు. మెండెలెస్ (క్యాడ్‌బరీస్) డైకిన్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలను సందర్శించారు. ఇక్కడి ఉత్పత్తులు, పనితీరును తెలుసుకున్నారు. శ్రీ సిటీ ప్రణాళిక, అమలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రశ్నించిన ట్రైనీ ఐఏఎస్‌లు, ఇతరులు అనుసరించాల్సిన అద్భుత మోడల్‌గా దీనిని అభివర్ణించారు. ట్రైనీ ఐఏఎస్‌లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు తమ అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం గర్వకారణమని శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
సత్యవేడు : మదనంబేడు అటవీ సమీప ప్రాంతంలో ట్రంచ్‌లు తవ్వుతున్న ఉపాఽధి కూలీలు ఐదుగురిపై తేనెటీగలు దాడి చేశాయి. శనివారం మదనంబేడుకు చెందిన ఉపాధి కూలీలు 180 మంది ట్రెంచ్‌ల పనులకు వెళ్లారు. భూతేశ్వరమ్మ ఆలయ సమీపంలో ట్రెంచ్ తీస్తున్న గోపి(53) సుజాత(50) మరో ముగ్గురిపై తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ దిలీప్‌కుమార్ సత్యవేడు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించి గోపి, సుజాతను తరువళ్లూరు(తమిళనాడు) జీహెచ్‌సీకి తరలించారు. సమాచారం తెలుసుకొన్న ఏపీఓ విజయ భాస్కర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఉపాధి కూలీలను అప్రమత్తం చేశారు.