పోలీసులకు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవానికి సెలవులు | Telangana Police staff will now get mandatory leave on birthdays and anniversaries: DGP B Shivadhar Reddy | Sakshi
Sakshi News home page

పోలీసులకు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవానికి సెలవులు

Apr 28 2026 1:26 AM | Updated on Apr 28 2026 1:26 AM

Telangana Police staff will now get mandatory leave on birthdays and anniversaries: DGP B Shivadhar Reddy

డీజీపీ శివధర్‌రెడ్డిని సన్మానిస్తున్న మహేశ్‌ భగవత్‌. చిత్రంలో గజరావు భూపాల్, చంద్రశేఖరరెడ్డి, స్వాతి లక్రా, చారుసిన్హా, డీఎస్‌ చౌహాన్‌

సర్క్యులర్‌ జారీ చేసిన డీజీపీ బి.శివధర్‌రెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో ఉండే పోలీసులకు ఊరటనిచ్చేలా తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వ్యక్తిగత జీవితం, ఉద్యో గం మధ్య సమ తుల్యత పెంపొందించాలనే లక్ష్యంతో వారి పుట్టిన రోజు, వివాహ వార్షి కోత్సవాల సందర్భంగా సెల వులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఒక సర్క్యులర్‌ను విడుదల చేశారు. అందులో పేర్కొన్న ప్రకారం..పోలీస్‌ శాఖలో పనిచేసే సిబ్బంది అందరికీ వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించ డమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నట్టుగా సర్క్యు లర్‌లో తెలి పారు. ఈ సెలవులను హక్కుగా పరిగణించరాదు. అత్యవసర పరిస్థి తులు మినహా సాధ్యమైనంత వరకు మంజూరు చేయాలని యూనిట్‌ అధికారు లకు సూచించారు. సర్వీస్‌ రికార్డు ప్రకారం సరైన ధ్రువీక రణ ఉండాలి. అదేవిధంగా సెలవు కోరు తున్న సిబ్బంది ముందస్తు లిఖితపూర్వక అభ్యర్థన అవసరం. అత్యవసర పరిస్థితుల్లో సెలవు నిరాకరించే అధికారం అధికారులకు ఉంటుంది. కాగా, ఈ నిర్ణయం ద్వారా పోలీసు సిబ్బందిలో మనోధైర్యం పెంపొందడమే కాకుండా కుటుంబ బంధాలు బలపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement