తెలంగాణ: గ్రూప్‌–4 దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు.. మైనారిటీ గురుకుల దరఖాస్తులకు కూడా

Telangana: Extension of deadline for receipt of Group 4 applications - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–4 ఆశా వహులకు శుభవార్త. దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

గత డిసెంబర్‌ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్‌–4 కేటగిరీలో మరి కొన్ని కొలువులు జతచేస్తూ అనుబంధ ప్రకటన విడుదల చేయడం, అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

గ్రూప్‌–4 ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం 49 వేలు, సోమవారం 34,247 దరఖాస్తులు వచ్చాయి. మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.   

మైనారిటీ గురుకుల దరఖాస్తుల గడువు పెంపు
మైనారిటీ గురుకుల పాఠ శాల, జూనియర్‌ కాలేజీలో 2023–24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లతో పాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్లు మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రెటరీ షఫీవుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040–23437909లో సంప్రదించవచ్చని తెలిపారు. 

మరో ఆరు డాక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు డాక్టర్‌పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ఇచ్చింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధి లోని ఈఎన్టీ విభాగంలో 3 అసిస్టెంట్‌ ప్రొఫె సర్లు, మరో 3 స్పీచ్‌పాథాలజిస్టులను నియ మించనుంది. మెడికల్‌రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. మరిన్ని వివరాలకు తమ బోర్డు వెబ్‌ సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top