కల్లోలం: ఎర్రగడ్డలో ఒక్కరోజే 32 శవాల అంత్యక్రియలు | Only One Day 32 Bodies Funerals In Erragadda Cemetery Ground | Sakshi
Sakshi News home page

కల్లోలం: ఎర్రగడ్డలో ఒక్కరోజే 32 శవాల అంత్యక్రియలు

Apr 28 2021 10:26 PM | Updated on Apr 28 2021 10:29 PM

Only One Day 32 Bodies Funerals In Erragadda Cemetery Ground - Sakshi

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడంతో శ్మశానాల్లో అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పాటు రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. ఎర్రగడ్డ ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో రోజు పెద్ద సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 32 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 32 కరోనా బారినపడిన మృతిచెందిన వారికి అంత్యక్రియలు చేశారు. 

హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ మరణించినవారే ఉన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ శ్మశానవాటికలో వాటికి దహన సంస్కారాలు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఒక్క ఎర్రగడ్డ శ్మశానం లెక్కలు మాత్రమే. అధికారికంగా ప్రకటించిన లెక్కలే ఇంత ఉంటే అనధికారికంగా ఎన్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ఎంత సంఖ్యలో కరోనా మృతులు సంభవిస్తున్నాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: లాక్‌డౌన్‌ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం

చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement