లాక్‌డౌన్‌ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం

Telangana: Home Minister Mahmood Ali Review On Night Curfew With Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులతో చర్చించాం.. అయితే లాక్‌డౌన్‌ పెట్టాలా లేదా అన్నది సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారు అని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. సమీక్ష తర్వాత లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అయితే లాక్‌డౌన్‌ పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని చెప్పారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, రాత్రికర్ఫ్యూ అమలుపై బుధవారం పోలీస్‌ శాఖ అధికారులతో హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత  పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందని పోలీసుల అధికారులకు చెప్పారు. ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజెక్షన్ వరకూ జరుగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త
చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు

పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top