కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం! | Massive Fire Engulfs Private Bus in Hyderabad Kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం!

Apr 17 2026 11:36 PM | Updated on Apr 18 2026 7:05 AM

Massive Fire Engulfs Private Bus in Hyderabad Kukatpally

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 734 వద్ద.. శ్రీదుర్గా మహేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలు ఆర్పడంలో నిమగ్నమైంది.

ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. తొలుత డ్రైవర్‌ క్యాబిన్‌లో మంటలు వచ్చాయి. దీంతో.. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోని 18 మంది ప్రయాణికులను కిందికి దించేశారు. తరువాత మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement