బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత | Bs Bajaj passes away | Sakshi
Sakshi News home page

బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత

Jul 29 2020 5:31 AM | Updated on Jul 29 2020 5:31 AM

Bs Bajaj passes away - Sakshi

హైదరాబాద్‌: బయోటెక్‌ రంగ ప్రముఖుడు డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ (93) మంగళవారం కన్నుమూశారు. ఆయన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియా బయోటెక్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏబీఏ) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటుకు, 2019లో జరిగిన బయో–ఆసియా సదస్సుకు ఆయన తీవ్రంగా కృషి చేశా రు. 

1999లో హైదరాబాద్‌ లో బయోటెక్నాలజీ స్థాపనకు బజాజ్‌ ఒక ప్రమోటర్‌గా పనిచేశారు. రాష్ట్రం లో ఆయన రూపొందించిన బయోటెక్‌ పరిశ్రమ పాలసీ ద్వారా జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటుకు, దాని పెరుగుదలకు దోహదపడింది. బయో రంగంలో మందులు, వ్యాక్సిన్ల తయారీలో ఆయన చాలా మంది శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేశారు. బజాజ్‌ మృతిపట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. బయోటెక్నాలజీ రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement