ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులు  | 45 Types Of Courses Allowed In Engineering | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులు 

Oct 20 2020 8:15 AM | Updated on Oct 20 2020 8:29 AM

45 Types Of Courses Allowed In Engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షనకు ఆదివారం అర్ధరాత్రి నుంచే  అవకాశం కలి్పంచేలా ఏర్పాట్లు చేసినా, సాంకేతిక కారణాలతో  సోమవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత  మొదలైంది.  ఈనెల 20తో సరి్టఫికెట్ల వెరిఫికేషన్, 22తో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, 24న సీట్ల కేటాయింపును ప్రకటించేలా అధికారులు ఇదివరకే షెడ్యూలు జారీ చేశారు. ఇక సోమవారం సాయంత్రం వరకు 57,530 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, అందులో 51,880 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 10,032 మంది వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కోర్సుల వివరాల్లో పలు మార్పులు, చేర్పుల తరువాత కనీ్వనర్‌ కోటాలో 72,998 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇంజనీరింగ్‌లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లున్నట్లు ప్రవేశాలు కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులను అనుమతించగా, ఫార్మసీలో రెండు కోర్సులను అనుమతించింది. 

కొత్త కోర్సులు, ప్రధాన బ్రాంచీల్లోని సీట్లు
‌ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 126 సీట్లు, ‌ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డాటా సైన్స్‌ 168, సీఎస్‌ఈ (‌ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మిషన్‌ లెరి్నంగ్‌) 5,310, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ 126, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ 42, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ 252, సీఎస్‌ఈ(సైబర్‌ సెక్యూరిటీ) 1,806, సీఎస్‌ఈ (డాటా సైన్స్‌) – 3,213, సీఎస్‌ఐటీ 336, సీఎస్‌ఈ (నెట్‌ వర్క్స్‌) 126, సీఎస్‌ఈ (ఐవోటీ) 1,281, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ 210, సీఎస్‌ఈ 16,681, ఈసీఈ 13,397, సివిల్‌ 6,378, ఈఈఈ 6,907, ఐటీ 4,650, మెకానికల్‌ 5,980, మైనింగ్‌ 328 సీట్లు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement