జోరుగా ఈ ఫైలింగ్‌ రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

జోరుగా ఈ ఫైలింగ్‌ రిజిస్ట్రేషన్‌

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: న్యాయవాదులు వారి కేసులను ఇక నుంచి ఈ ఫైల్‌ ద్వారా వేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జిల్లా కోర్టులో న్యాయవాదులు వివరాలు ఈ ఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. జిల్లా కోర్టులో దాదాపు 800 మంది న్యాయవాదులు ఉన్నారు. వీరంతా ఈ ఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నా రు. ఈ ఫైలింగ్‌ విధానం ఈనెల 15 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలి పింది. ఎవరికి వారు, లేదా మీ సేవ కేంద్రాల్లోనూ ఈ రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలుంది. దీని వల్ల నకిలీ లాయర్ల లీలలు ఉండవు. న్యాయవాదులకు సంక్షేమాలు అందుతాయి. వ్యాజ్యాలు ఆన్‌లైన్‌లో చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement