చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. ఫాస్టెస్ట్‌ ఇండియన్‌గా | Sanju Samson becomes fastest Indian cricketer in IPL history to achieve this milestone | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. ఫాస్టెస్ట్‌ ఇండియన్‌గా

Apr 26 2026 8:15 PM | Updated on Apr 26 2026 8:15 PM

Sanju Samson becomes fastest Indian cricketer in IPL history to achieve this milestone

ఐపీఎల్‌-2026లో చెపాక్ మైదానం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ నిరాశ‌ప‌రిచాడు. గ‌త మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శాంసన్‌.. గుజరాత్‌పై మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 15 బంతుల్లో 11 పరుగులు చేసి సంజూ ఔటయ్యాడు.

అయితే ఈ మ్యాచ్‌లో శాంసన్ విఫలమైనప్పటికి  ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడి శాంసన్ రికార్డు సృష్టించాడు. సంజూ కేవలం 3555 బంతుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్‌కే లెజెండ్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 3620 బంతుల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో దిగ్గజాలు ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్‌కేపై 6 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.  ఓపెనర్‌ సాయిసుదర్శన్‌(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మరోసారి అదరగొట్టాడు.

అత్యంత తక్కువ బంతుల్లో 5000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:

సంజూ శాంసన్‌ – 3555 బంతులు

సురేష్ రైనా – 3620 బంతులు

కేఎల్ రాహుల్ – 3688 బంతులు

ఎంఎస్ ధోని – 3691 బంతులు

రోహిత్ శర్మ – 3817 బంతులు

విరాట్ కోహ్లీ – 3827 బంతులు
చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'

Advertisement
 
Advertisement
Advertisement