జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన ప్రణయ్ పోరాటం | Sakshi
Sakshi News home page

Japan Open 2022: జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన ప్రణయ్ పోరాటం

Published Fri, Sep 2 2022 1:33 PM

Prannoy HS goes out crashing in quarter finals - Sakshi

జపాన్‌ ఓపెన్‌-2022 సూపర్‌ 750 టోర్నీలో భారత షట్లర్లు పోరాటం ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే స్టార్‌ షట్లర్లంతా నిష్క్రమించగా.. చివరగా ఆశలు పెట్టుకున్న హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఇంటిబాట పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌ చేతిలో 17-21, 21-15, 20-22 తేడాతో ప్రణయ్‌ ఓటమిపాలైయ్యాడు.

కాగా ప్రణయ్‌ ప్రీక్వార్టర్స్‌లో సింగపూర్‌ ఆటగాడు కియాన్‌ యును వరుస సెట్లలో (22-20 21-19) మట్టికరిపించి క్వార్టర్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు ఈ టోర్నీ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా.. ఫ్రీ క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు.
చదవండి: Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్‌ కాంగ్‌ను పాక్‌ లైట్‌ తీసుకుంటే అంతే సంగతులు!

Advertisement
 
Advertisement
 
Advertisement