IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. తొలి టికెట్‌ కొన్న ఒడిశా ముఖ్యమంత్రి..!

Odisha CM buys first ticket of 2nd T20I match at Barabati In Cuttack - Sakshi

భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జూన్ ‌9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 జూన్ 12న  కటక్‌లోని బరాబతి స్టేడియం వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కి తొలి టికెట్‌ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు. ఇక బరాబతి స్టేడియం వేదికగా రెండో సారి దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది.

2015లో జరగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. బిజినెస్ స్టాండర్డ్ సమాచారం ప్రకారం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహెరా సోమవారం ముఖ్యమంత్రికి టికెట్‌ను అందజేశారు. అదే విధంగా స్టేడియం వద్ద చేసిన భద్రతా ఏర్పాట్లను నవీన్ పట్నాయక్‌కు పంకజ్ లోచన్ వివరించినట్లు తెలుస్తోంది. 

భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌
మొదటి టీ20: జూన్‌ 9- గురువారం- అరుణ్‌ జైట్లీ స్టేడియం- ఢిల్లీ
రెండో టీ20: జూన్‌ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్‌
మూడో టీ20: జూన్‌ 14- మంగళవారం- డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం- విశాఖపట్నం
నాలుగో టీ20: జూన్‌ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం- రాజ్‌కోట్‌ 
ఐదో టీ20: జూన్‌ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
నోట్‌: అన్ని మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభమవుతాయి.

ప్రొటిస్‌తో సిరీస్‌కు భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్‌ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

దక్షిణాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్‌, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ,  ట్రిస్టన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్
చదవండి: SL Vs Aus 1st T20: ఆసీస్‌తో మొదటి టీ20.. శ్రీలంక తుది జట్టు ప్రకటన.. విజయం మాదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top