సన్‌రైజర్స్‌లోకి సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం | IPL 2026: SRH pick Gerald Coetzee as injury replacement for David Payne | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌లోకి సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం

Apr 18 2026 10:20 AM | Updated on Apr 18 2026 10:38 AM

IPL 2026: SRH pick Gerald Coetzee as injury replacement for David Payne

సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం గెరాల్డ్‌ కొయెట్జీకి ఊహించని విధంగా ఐపీఎల్‌ 2026 ఆఫర్‌ దక్కింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ గాయపడిన డేవిడ్‌ పేన్‌ స్థానంలో కొయెట్జీని జట్టులోకి తీసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడిన కొయెట్జీని ఈ సీజన్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోగా.. సీజన్‌ మధ్యలో సన్‌రైజర్స్‌ రూ. 2 కోట్ల మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.

కొయెట్జీ ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు సాధించాడు. ఇతని రాక సన్‌రైజర్స్‌లో కొత్త జోష్‌ నింపింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్నా బౌలింగ్‌లో తేలిపోవడంతో గెలవాల్సిన మ్యాచ్‌ల్లోనూ ఓడింది. కొయెట్జీ రాక సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కష్టాలను తీరుస్తుందని అంతా భావిస్తున్నారు. త్వరలో ఈ జట్టులో ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కూడా జట్టులోకి చేరనున్నాడు. దీంతో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ మరింత బలపడనుంది.

సన్‌రైజర్స్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 3 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ‍ప్రస్తుతం ఆ జట్టు రన్‌రేట్‌ 0.576గా ఉంది. తాజాగా పటిష్టమైన రాజస్థాన్‌ రాయల్స్‌ను సొంతగడ్డపై మట్టికరిపించిన సన్‌రైజర్స్‌ ఇవాళ (ఏప్రిల్‌ 18) సొంతగడ్డపైనే సీఎస్‌కేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం​ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement