బుమ్రా రికార్డ్‌ను బద్దలు కొట్టిన చాహల్‌

Chahal Surpasses Jasprit Bumrah To Become Leading T20 Wicket Taker For India - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ భారత్‌ తరఫున పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో చాహల్‌ ఈ ఘనతను సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా(50 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును చాహల్‌ ఈ మ్యాచ్‌లో అధిగమించాడు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌  ఎనిమిదో ఓవర్‌లో జోస్‌ బట్లర్‌ను ఔట్‌ చేసిన చాహల్‌.. పొట్టి ఫార్మాట్‌లో 60వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాహల్‌ ఈ ఘనతను కేవలం 46వ మ్యాచ్‌లోనే సాధించాడు. ఓవరాల్‌గా చాహల్‌కు ఇది భారత్‌ తరఫున వందో అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా చాహల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top