ఆటో యూనియన్ నాయకుల వెల్లడి
సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం నుంచి ఆటో చార్జీలు పెంచుతున్నట్లు సంగారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ వెల్లడించింది. యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాయార్ పాషా, టౌన్ ప్రెసిడెంట్ బాబా మాట్లాడుతూ..ఓల్డ్ బస్టాండ్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు, బసవేశ్వర విగ్రహం వరకు రూ.15 నుంచి రూ.20పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఓల్డ్ బస్టాండ్ నుంచి మల్కాపూర్, చింతల్, కంది వరకు రూ.25నిర్ణయించారు. ఓల్డ్ బస్టాండ్ నుంచి ఫసల్‌వాది, ఎమ్మెన్నార్ చౌరస్తా వరకు రూ.20 తీసుకోనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు రూ.10 చొప్పున తీసుకుంటామని తెలిపారు.
క్షయ వ్యాధిని
నిర్మూలించాలి: డీఎంహెచ్‌ఓ
సంగారెడ్డి: సమాజంలో క్షయ (టీబీ)వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి స్పష్టం చేశారు. జిల్లాలోని టెస్టింగ్ సెంటర్లు, పీల్‌స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు సూచనలు సలహాలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రిలో నమోదయ్యే టీబీ కేసులు తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలిసేలా నిఘా పెట్టాలన్నారు. కార్యక్రమంలో టీబీ జిల్లా అధికారి అరుణకుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాత శిశు మరణాలు తగ్గించాలి
జిల్లాలో మాత శిశు మరణాల రేటు పూర్తిగా తగ్గించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. హత్నూర, దౌల్తాబాద్, కసర్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నమోదైన మాతా మరణాల కేసులను సమీక్షించారు. అధిక ప్రమాద గర్భిణీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి, రిఫరల్ వ్యవస్థను పటిష్టం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.


