జీవితంపై విరక్తితో.. గృహిణి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో.. గృహిణి ఆత్మహత్య

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

వర్గల్‌(గజ్వేల్‌): అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తిచెంది, గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం ఉదయం వర్గల్‌ మండలం గౌరారంలో వెలుగుచూసింది. గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నగరం శంకర్‌గౌడ్‌, లక్ష్మి(47) దంపతులకు రాజేష్‌, రాకేష్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. లక్ష్మి గృహిణి కాగా భర్త, కుమారులు ప్రైవేటు ఉద్యోగులు. కొంతకాలం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఆమె బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక నీళ్లతో కూడిన పెద్ద ప్లాస్టిక్‌ డ్రమ్ములోకి దూకి బలవన్మరణం చెందింది. భర్త శంకర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హవేళిఘణాపూర్‌(మెదక్‌): అప్పుల బాధ భరించలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్‌ మండలం శివాయిపల్లిలో గురువా రం వెలుగు చూసింది. వివ రాలిలా ఉన్నాయి. గ్రామాని కి చెందిన రైతు తుపాకుల నవీన్‌(28) ఇటీవలే తన తమ్ముడు నరేశ్‌ వారం రోజు ల క్రితం వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. దీంతో నవీన్‌కు వ్యవసాయం, ఇంటి అవసరాల కోసం రూ.5లక్షల వరకు అప్పులు చేశాడు. నవీన్‌ గురువారం ఏడుపాయల్లో వారి బంధువుల వింధు ఉండగా భార్య సరిత, కుమారుడిని అక్కడి వదిలి వేసి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వచ్చాడు. తిరిగి మెదక్‌ మండలం మల్కాపూర్‌ తండా పలుగు వెనుకల చెట్టుకు ఉరి వేసుకున్నాడని కుటుంబీకులకు మధ్యాహ్నం గ్రామస్తులు సమాచారం అందించా రు. వారెళ్లి చూడగా నవీన్‌ చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. మృతుడు నవీన్‌ తనకు అప్పు ఉందని బాధపడుతూ ఉండేవాడని, మనస్తాపంతోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య సరిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement