నిలదీతలు..! | - | Sakshi
Sakshi News home page

నిలదీతలు..!

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2026
వాగ్వాదాలు..

సమగ్రాభివృద్ధికి సమన్వయంతో

కృషి చేయాలి : మంత్రులు

జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ పేర్కొన్నారు. ఇండస్ట్రియల్‌ హబ్‌గా వెలుగొందుతున్న జిల్లాలను అభివృద్ధి మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. రైతులు పంటల మార్పిడి, ఆయిల్‌పామ్‌ సాగు దిశగా ప్రోత్సహించాలన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతులను నర్సింగ్‌ విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య మౌలిక వసతులు కల్పించాలన్నారు.

ధాన్యం, జొన్నల కొనుగోళ్లలో వైఫల్యాలను ప్రస్తావించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష వాగ్వాదాలు..నిలదీతల మధ్య సాగింది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాల అమలును వివరించగా..రైతుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ధాన్యం సేకరణలో సర్కారు నిర్లక్ష్యం..జొన్నల కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్‌, మాణిక్‌రావు, సునీతారెడ్డి ప్రస్తావించారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా కూడా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దీంతో అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి వివేక్‌ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలు రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ తమాషాలు చేస్తోందని వివేక్‌ వ్యాఖ్యానించడం పట్ల బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. తక్షణం ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో జరిగిన వైఫల్యాలను మంత్రి వివేక్‌తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గుర్తు చేశారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల నిలదీతలు..వాగ్వాదాలతో సమావేశంలో వాతావరణం వేడెక్కింది.

ఎమ్మెల్యేల కోటా కోసం

బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల పట్టు

ందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యేల కోటా అంశాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశంలో లేవనెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న మాదిరిగానే తమకు కూడా ఇళ్ల కోటాను కేటాయించాలని, తాము కూడా ప్రజల ఆశీర్వాదం ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మాదిరిగానే ఈ ఇళ్లను తమకు కూడా కోటా నిర్ధారించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు జొన్నల నిల్వలు గోదాముల్లో పేరుకుపోవడంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని, దీంతో ఇటు జొన్నల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు.

మీడియాను అనుమతించని అధికారులు

చాలా నెలల తర్వాత జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇతర జిల్లాలకు భిన్నంగా ఇక్కడ మీడియా అనుమతి లేకుండా ఈ సమావేశాన్ని నిర్వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. విశాలమైన జిల్లా పరిషత్‌ సమావేశ హాలు ఉన్నప్పటికీ..ఈ సమావేశాన్ని అంతంత మాత్రంగా ఉన్న వీడియోకాన్ఫరెన్స్‌ హాలులోనే నిర్వహించడంతో ఇటు అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు సగానికిపైగా శాఖల జిల్లా ఉన్నతాధికారులు ఈ సమావేశం జరుగుతున్న సేపు హాలు బయట పడిగాపులు కాయడం గమనార్హం. సమీక్షలో ఎంపీలు సురేశ్‌షెట్కార్‌, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ పరితోశ్‌పంకజ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలు రాజకీయం

చేస్తున్నాయన్న మంత్రి వివేక్‌

వాడీవేడిగా జిల్లా సమీక్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement