సంగారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.25 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈ నెల 18న తలపెట్టిన ‘ఛలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని శివ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ‘ఛలో హైదరాబాద్’కు సంబంధించిన నిర్వహించిన సమావేశానికి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ‘ఛలో హైదరాబాద్’కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ...మూడేళ్లుగా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లు లు చెల్లించకపోవడంతో అనేకమంది అప్పుల పాలై వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారన్నారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు పాల్పడుతుండగా మరికొందరు ఒత్తిడి కారణంగా గుండెనొప్పితో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులకు టెండర్లు వేయాలంటేనే కాంట్రాక్టర్లు జంకుతున్నారని వ్యాఖ్యానించారు. బిల్లులు సకాలంలో అందక కాంట్రాకర్ల వద్ద డబ్బులు లేక అనేక పను లు అర్థాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. ఓ వైపు కార్పొరేట్ కాంట్రాక్ట్ కంపెనీలు రాకతో చిన్న కాంట్రాక్టర్లు రోడ్డున పడుతుంటే పెండింగ్ బిల్లులు రాక అప్పుల భారంతో మరింత కుదేలవుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ముఖ్య సలహాదారులు పి.భాస్కర్ రెడ్డి, సుధాకర్, సత్యమయ్య, రాములుగౌడ్, చీల మల్లన్న, విష్ణువర్ధన్‌రెడ్డి, జిన్న శ్రీధర్‌రెడ్డి, మనోజ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్‌రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి
సమస్యలపై ఈనెల 18నచలో హైదరాబాద్
సంగారెడ్డి సమావేశానికి హాజరైనమూడు జిల్లాల కాంట్రాక్టర్లు


