సంగారెడ్డి /పటాన్‌చెరు టౌన్ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోఎస్ మంత్రి వివేక్‌కు విజ్ఞప్తి చేసింది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్‌ను టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావీద్‌అలీ, కార్యదర్శి వేల్పూరు రవి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సేవా సంబంధిత అంశాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో నాయకులు సమర్పించిన వినతులను మంత్రి విని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీనిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
ఇస్నాపూర్‌కు ప్రత్యేక నిధులివ్వండి
ఇస్నాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మంత్రి వివేక్‌ను కోరారు. సంగారెడ్డిలో జరిగిన సమీక్షకు హాజరైన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్‌ను ఇస్నాపూర్ చౌరస్తాలో కలిసి ఘనస్వాగతం పలికి నిధులు, పలు సమస్యలపై ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సమర్పించారు. నేషనల్ హైవే నుంచి లక్డారం– బ్యాతోల్ – రుద్రారం – ఏర్థనూర్ వరకు రోడ్డు, ఇరు వైపులా ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
మంత్రిని కలిసిన టీఎన్‌జీఓ నేతలు


