చైన్‌ స్నాచర్‌ రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచర్‌ రిమాండ్‌

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

పటాన్‌చెరు టౌన్‌: చైన్‌ స్నాచర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, క్రైమ్‌ సీఐ రాజు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 1న రుద్రారం అభయాంజనేయ స్వామి దేవాలయంలో పనిచేస్తున్న అంజమ్మ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రుద్రారంలో గొలుసు దొంగతనం తానే చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. చందానగర్‌లో వాల్యూ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దుకాణంలో బంగారం కరిగించి రూ.1.03 లక్షలకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు 8.07 గ్రాముల బంగారం, దొంగతనానికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నారు. కాగా నిందితుడి స్వస్థలం రాయి కోడ్‌ మండలంలోని హుస్నాబాద్‌ గ్రామం కాగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement