కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ, వ్యవసాయ కళాశాల డైరెక్టర్ ఎం.దేవేందర్‌రెడ్డికి వరంగల్ ఎస్‌ఆర్ యూనివర్సిటీ ఫౌండర్, ఛాన్స్‌లర్ వరదారెడ్డి డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మంగళవారం ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. 40 ఏళ్లుగా ఆయన వ్యవసాయ శాస్త్రం, జలవనరుల నిర్వాహణ, సుస్థిర వ్యవసాయం, అభివృద్ధి, రైతు సంక్షేమం, నవీన ఆవిష్కరణల్లో ఆయన చేస్తున్న సేవలకు సెన్స్ డిగ్రీని అందజేశారు. కార్యక్రమంలో ఢిల్లీ ఐఐటీ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ వి.రాంగోపాలరావు, జాతీయ సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ అవార్డు గ్రహిత దీపికరెడ్డి, ఎస్‌ఆర్ యూనివర్సిటీ వీసీ దీపక్ పాల్గొన్నారు.


