టమాటా.. ధరల మంట! | - | Sakshi
Sakshi News home page

టమాటా.. ధరల మంట!

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

జహీరాబాద్‌ టౌన్‌: టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకు కిలో రూ. 20 పలికిన ధర ప్రస్తుతం జహీరాబాద్‌ మార్కెట్‌లో కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతుంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ధరలు పెరగడంతో టమాటా కొనడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వేసవిలో టమాటా సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సరఫరా లేక ధరలు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. వారాంతపు సంతలో కూడా టమాటా ధరలు అధికంగా ఉన్నాయి. జహీరాబాద్‌ కూరగాయల మార్కెట్‌లో కొన్ని రోజులకు ముందు రూ.400 పలికిన టమాటా బాక్స్‌ ప్రస్తుతం రూ. 1,200 వరకు పలుకుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement