చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ధాన్యం బస్తాలను తరలించేందుకు అవసరమైన లారీల కోసం అధికారులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలో తహసీల్దార్ మాలతి, ఎస్‌ఐ శివానందం చేగుంట–మెదక్ రోడ్డుపై పద్మనాభస్వామి గుట్ట వద్ద పరిశ్రమల వద్దకు వచ్చిన లారీలను ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. సోమవారం వరకు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సెలవు రోజైనా కూడా అధికారులు విధులకు హాజరయ్యారు. కాగా లారీ డ్రైవర్‌లతో మాట్లాడి మండలంలోని పలు గ్రామాలకు పంపించారు.


