శివ్వంపేట(నర్సాపూర్): అనారోగ్యం, వడదెబ్బతో కూలీ మృతి చెందాడు ఈ ఘటన మండల పరిధిలోని దొంతిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన బణుపురం వెంకటేశ్(37) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి స్థానిక కల్లు దుకాణం వద్ద అపస్మారక స్థితిలో మృతి చెందాడు. అనారోగ్యం, వడదెబ్బ మూలంగా మృతి చెందాడని మృతుడి భార్య మంజుల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుకర్‌రెడ్డి తెలిపారు.


