మద్దూరు(హుస్నాబాద్): వేర్వేరు చోట్ల ధాన్యం లోడ్‌తో వెళ్తున్న రెండు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. వివరాలు ఇలా... మండలంలోని వల్లంపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఆదివారం గ్రామంలోని రైస్‌మిల్లుకు ట్రాక్టర్ ధాన్యం లోడ్‌తో వెళ్తుండగా బోల్తాపడింది. అలాగే రేబర్తి–వల్లంపట్ల గ్రామాల మధ్యలో మరో ధాన్యం ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల ట్రాక్టర్ ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్న క్రమంలో అవి బోల్తా పడుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సరిపడా లారీలను అందుబాటులో ఉంచి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


