తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

తూప్రాన్‌: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ సంఘటన పట్టణంలోని గీతా మందిరం సమీపంలోని లక్ష్మీనగర్‌ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. సీఐ వెంకటరాజాగౌడ్‌ వివరాల ప్రకారం... విద్యుత్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళి తన కుటుంబ సభ్యులతో గత నెల 29న పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి చెరుకొని చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు, బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు, ల్యాప్‌ట్యాప్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే విలువైన వస్తువులు ఇంట్లో పెట్టవద్దని సూచించారు. పోలీసులకు సమాచారం ఇస్తే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

బంగారు, వెండి ఆభరణాలు,

నగదు అపహరణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement