చేగుంట(తూప్రాన్): రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు కోచ్ కరణం గణేశ్ రవికుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా బుదేరా మండలం ఆక్సిజన్ యూనివర్సిటీలో రెండురోజుల పాటు అండర్ 18 బాలబాలికల రగ్బీ పోటీలు జరిగాయి. బాలికల విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన నవ్యశ్రీ , రోజా, అంజలి, సోనా, అఖిల, షరీబా, గాయత్రి, దివ్య, వర్షశ్రీ, రాణి, సుప్రియ, వందన పాల్గొన్నారు. వీరు ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మల్లీశ్వరీ, పీడీలు, వారద, రంగీల, జయశీల తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


