చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ట్రాక్టర్, గడ్డి వాము దగ్ధం కాగా, లేగదూడ కూడా మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన గుడికందుల మధు తన పొలం వద్ద వరి గడ్డి కట్టలు కట్టి పెట్టాడు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి తన పొలంలోని గడ్డి కట్టలు, పక్కనే ఉన్న ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. అక్కడే కట్టేసిన ఏడాది లేగదూడ సైతం మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. గమనించిన సమీప రైతులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పినప్పటికీ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.
లేగదూడ మృతి


