పటాన్‌చెరు టౌన్: దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇస్నాపూర్‌లోని పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులను గమనించిన స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని మధు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన షెడ్డు నిర్మాణ పనులకు సొంత నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చాలా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి మధు


