జహీరాబాద్: పట్టణంలోని ఎస్‌బీహెచ్ కాలనీలో ఆదివారం 210వ నగర సంకీర్తన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శోభాయాత్ర చేపట్టారు. అనంతరం హనుమాన్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కంది హరేకృష్ణ మందిరం బాధ్యులు విభీషణ్‌దాస్ మహారాజ్ మాట్లాడారు. సర్వ జగత్ రక్షకుడైన శ్రీమహా విష్ణువే ప్రజాపతి అన్నారు. హరినామ సంకీర్తన చేయడంతో యజ్ఞ ఫలాలు అందుతాయన్నారు. జూలై 18వ తేదీన జగన్నాథ్ రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నహాలు ప్రారంభించాలని సూచించారు. ఇదిలా ఉండగా, హుగ్గెల్లిలో 175 నగర సంకీర్తనను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.


