అన్ని వర్గాల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

పటాన్‌చెరు: నియోజకవర్గ పరిధిలోని వీరభద్రీయుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ అన్నారు. ఇస్నాపూర్‌ వీరభద్రియుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముత్తంగి డివిజన్‌ పరిధిలో గల భవన నిర్మాణ స్థలంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇస్నాపూర్‌ వీరభద్రియుల సంక్షేమానికి ఇప్పటికే సొంత నిధులతో 200 గజాల స్థలం అందించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ఉపేందర్‌, మాజీ యాదగిరి యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు భిక్షపతి, కుమార్‌ గౌడ్‌, ప్రభాకర్‌, మేరాజ్‌ ఖాన్‌, సందీప్‌, రామకృష్ణ, సంఘం అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి..

పటాన్‌చెరు టౌన్‌: స్థానిక డివిజన్‌ పరిధిలోని కృషి డిఫెన్స్‌ కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం మాజీ ప్రజా ప్రతినిధులు, బల్దియా అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్వరలో వర్షపు నీరు తరలించేందుకు ప్రత్యేక డ్రైన్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ విభాగం డీఈ కృష్ణవేణికి ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు నర్ర భిక్షపతి, పృథ్వీరాజ్‌, శ్రీరాములు, బలవంత్‌, వెంకటేష్‌, కాలనీ అధ్యక్షులు అమరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement