సంగారెడ్డి: పట్టణంలో పీఎస్‌ఆర్ గార్డెన్‌లో కల్కి భగవాన్ భక్త బందం ఆధ్వర్యంలో కల్కి భగవాన్ మూర్తులకు కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు కల్కి భగవాన్ దంపతుల విగ్రహమూర్తులకు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి భగవాన్ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలని ఆకాక్షించారు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా కల్యాణం నిర్వహిస్తున్న కల్కి భగవాన్ భక్త బందాన్ని ఆయన అభినందించారు.కల్కి భగవాన్ ఆలయం కోసం స్థలాన్ని సేకరించామని, ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. అనంతరం ఆలయ నిర్మాణం కోసం తన పూర్తి సహకారాన్ని అందిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కల్కి భక్త బంద సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


