రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
సంగారెడ్డి జోన్: ఈవీఎంలు, ఇతర ఎన్నికల పరికరాల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఈవీఎం గోడౌన్‌ను శనివారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి కలెక్టరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ..సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈవీఎం గోడౌన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, మాస, త్రైమాసిక తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సామగ్రి భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంగీత, ఆర్డీఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జైరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.


