జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్
జహీరాబాద్ టౌన్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ డీలర్లను సూచించారు. రైతువేదికలో శనివారం నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడానికి డీలర్లు చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను రైతులు యాప్ ద్వారా పొందాలని చెప్పారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులను చైతన్య పరచాలన్నారు.


